తెలంగాణలో కొత్తగా 512 కరోనా కేసుల నమోదు... అప్డేట్స్ ఇవిగో!

  • జీహెచ్ఎంసీలో 125 కేసుల నమోదు
  • కోలుకున్న కరోనా పేషెంట్స్ 1,217 మంది    
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,673
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 512 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 125 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందారు. ఇదే సమయంలో 1,217 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,85,143కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 7,73,362 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 4,100 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 7,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది.  



Telangana
Corona Virus
Updates

More Telugu News